Jul 24,2023 00:33

సమావేశంలో మాట్లాడుతున్న జి.మల్లీశ్వరి

పల్నాడు జిల్లా: బిఎల్‌ఒ డ్యూటీలు చేయాలని అంగన్వాడీ లను ఒత్తిడి చేయడంపై ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పెర్స్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్య దర్శి జి.మల్లీశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలు అనేక రకాల యాప్‌ లలో రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయడంతో పాటు పిల్లలకు,తల్లులకు పోషకాహారం వండి పెట్టా ల్సిన బాధ్యతలు ఉన్న నేపథ్యంలో బిఎల్‌ఒ విధులకు హాజరవడం సాధ్యం కాదన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్కూల్లోనే ఉం డాల్సి వస్తుందని,ఈ నేపథ్యంలో బిఎల్‌ఒ డ్యూటీకి వెళ్లడం వారికి సాధ్యపడదన్నారు. గ్రామాలలో ముఠా తగాదాల నేపథ్యంలో రాజకీయ వేధింపులకు కూడా అంగన్వాడీలు గురవుతునా ్నరన్నారు. గతంలో అం గన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అనేక పోరాటాలు చేసి బిఎల్‌ఒ డ్యూటీల నుండి వెసులు బాటు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో 2019 లో విముక్తి లభించిందన్నారు. ప్రస్తుతం రాజుపాలెం, సత్తెనపల్లి మండలాల్లో ఉద్యోగుల కొరత అంటూ అంగ న్వాడీలను ఆ విధులకు హాజరు కావాలని ఒత్తిడి చేయడం తగదన్నారు. ఒత్తిడి శృతి మించితే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.గార్డియన్‌ నియా మక నిర్ణ యాన్ని వెనక్కి తీసుకోవాలని, పెండింగ్‌ లేకుండా సకాలంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.