వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
బిడ్డను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలి
ప్రజాశక్తి నెల్లూరు:అల్లిపురం టిడ్కో హౌసెస్ వద్ద అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు మీటర్లు తలపెట్టి చనిపోయిన బిడ్డ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ డిమాండ్ చేశారు . సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం గ్రామంలో స్కూలు పక్కన 42 సెంట్లు సీలింగ్ భూమి సీలింగ్ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ దారులు సొంతం చేసుకుని అమ్ముకున్నారన్నారు. ప్రభుత్వం విచారణ చేపట్టి ప్రభుత్వ భూములను అక్రమంగా విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.










