Feb 28,2023 21:58

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
           పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే ఆ తల్లి ప్రాణాలొదిలింది. పుట్టిన బిడ్డను తనివితీరా చూడకుండానే ఆమె మృతిచెందని పలువురిని కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తాడతోట గ్రామానికి చెందిన రామలక్ష్మి(36) పిహెచ్‌సి వైద్యురాలిగా పనిచేస్తోంది. నిండు గర్భిణీ కావడంతో ప్రసవ నిమిత్తం రాజమండ్రి జిఎస్‌ఎల్‌ ఆసుపత్రికి ఇటీవల వెళ్లారు. మంగళవారం ఉదయం ఆమెకు పురిటినొప్పులు రావడంతో ఆపరేషన్‌ చేసి ప్రసవం చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే డెలివరీ అయిన కొద్దిసేపటికి ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చి ప్రాణాలు కోల్పోయింది. రక్తంలో ఉమ్మ నీరు కలవడం వల్ల రక్త నాళాల్లో బ్లాక్స్‌ ఏర్పడి ఊపిరితిత్తుల సమస్య వచ్చి మృతిచెందిందని వైద్యులు తెలిపారు. అలాగే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు.