ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఇంకొల్లులో జై భీమ్ జై తెలుగుదేశం భారీ బహిరంగ సభ నిర్వహించారు. భారీ బహిరంగ సభలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, కొండపి శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజరు కుమార్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు, చీరాల నియోజకవర్గ ఇంచార్జ్ ఎంఎం కొండయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దళితులు, గిరిజనులు, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులు హత్యలను నిరసిస్తూ, అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి, చైతన్యం నింపేందుకు ఈ బహిరంగ సభ నిర్వహించామని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు వివరించారు. తొలుత ఇంకొల్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. డప్పు వాయిద్యాలతో యువత ముందుకు కదిలారు.
చీరాల: భారతదేశ దిక్సూచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బీసీ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూరగాని లక్ష్మి అన్నారు. శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీసీ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, 5వ వార్డు కౌన్సిలర్ సూరగాని లక్ష్మి, నరసింహారావు దంపతుల ఆధ్వర్యంలో స్థానిక ముక్కోన పార్క్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ పోరాడాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌విఎన్ మల్లేశ్వరావు, ధనుంజయ, సూరగాని పిచ్చయ్య, భాస్కర్, నారాయణ, అసిరి నాయుడు, సూరగాని హనుమంతురావు, వసంతరావు, గుడిపల్లి వెంకట్రావు, శ్రీకాంత్, తులసి, తిరుపతిరావు పాల్గొన్నారు.










