Jul 09,2023 21:15

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే, ప్రముఖులు

 కడప అర్బన్‌ : కవిగా, రచయితగా, నటుడుగా, నాటక కర్తగా, దర్శకుడుగా, నాటక ప్రయోక్తగా, ఉత్తమ ఆచార్యులుగా బహు ముఖీన సేవలందించిన ప్రజా ్ఞవంతుడు ఆచార్య మూల మలి ్లకార్జునరెడ్డి అని మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి అన్నారు. లలిత కళానికేతన్‌ సాంస్కతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలోని బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి అభినందన సంచిక 'మలి ్లకార్జునీయం' పుస్తకావిష్కరణ సభను నిర్వ హించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మైదుకూరు శాసనసభ్యులు వేదికపై ఉన్న అతిథులతో కలసి ముందుగా 'మల్లికార్జునీయం' పుస్తకాన్ని ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లికార్జున రెడ్డి సాహితీవేత్తగా, ఉత్తమ ఆచార్యులుగా సేవలందించి మైదుకూరు నియో జకవర్గానికి గర్వకారణమయ్యారన్నారు. వ్యక్తిగా ఎంతోమందికి సన్నిహితంగా మెలగుతూ జిల్లాలోనే సాంస్కతిక సారథిగా కొనసాగుతున్నారన్నారు. బ్రౌన్‌ గ్రంథాలయానికి పాఠకుడుగా తన ప్రస్థానాన్ని కొనసాగించిన మల్లికార్జున రెడ్డి సాహితీవేత్తల సాంగత్యంతో రచయితగా ఎదిగి తిరిగి అదే గ్రంథా లయానికి సంచాలకులుగా సేవలందించడం, గ్రంథాలయ ప్రగతికి కషి చేయడం హర్షణీ యమన్నారు. ఆత్మీయ అతిథి, కవిత విద్యా సాంస్కతిక సేవా సంస్థ అధ్యక్షులు అలపర్తి పిచ్చ య్య చౌదరి మాట్లాడుతూ మల్లికార్జున రెడ్డి తమ సంస్థ తరపున ఏ కార్యక్రమం నిర్వహించినా కార్యక్రమ రూపకల్పనతోపాటు నిర్వహణ బాధ్య తలను కూడా చేపట్టేవారని, బ్రౌన్‌ గ్రంథా లయంలో జరిగే సాహిత్య కార్యక్రమాలకు తనకు తప్పక ఆహ్వానం అందించేవారన్నారు. మల్లికార్జున రెడ్డి బాధ్యులుగా ఉన్నప్పుడు తన వద్ద ఉన్న అనేక పుస్త కాలను గ్రంథాలయానికి బహూ కరించానన్నారు. పుస్తక సమీక్షకులు, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం సభ్యులు డాక్టర్‌ తవ్వా వెంకటయ్య మాట్లా డుతూ మల్లికార్జున రెడ్డి జీవితం తెరచిన పుస్తకమని, ఆయన జీవిత ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శ ప్రాయమన్నారు. ఆ తర్వాత వేదికపై ఉన్న అతిథు లను, మల్లికార్జునీయం పుస్తక సంపాదకవర్గ మిత్రు లను, పుస్తక ముద్రణకు ఆర్థికంగా సహక రించినy ారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆచార్య మల్లి కార్జున రెడ్డిని మిత్రులు, బంధువులు, ఆత్మీయులు ఘనంగా సత్కరించారు. ఆకాశవాణి క్యాజువల్‌ అనౌన్సర్‌ భూమిరెడ్డి స్వరూ పరాణి సభా నిర్వహణ చేశారు. నిర్వాహకులుగా మూల ఈశ్వరరెడ్డి, మూల శివప్రసాద్‌ రెడ్డి, మూల దేవ మునిరెడ్డి వ్యవహరించారు.