ప్రజాశక్తి-బాపట్ల: అధ్యాపకుడిగా, కవి, చిత్రకారుడుగా బహుముఖ ప్రజ్ఞతో దివంగత విశ్రాంత అధ్యాపకుడు దర్భా బాబూరావు ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారని సుప్రసిద్ధ రచయిత్రి చిల్లర భవానీదేవి అన్నారు. ఆదివారం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల శాఖ గ్రంథాలయంలో బాబూరావు సంస్మరణ సభ నిర్వహించారు. భవానీ దేవి మాట్లాడుతూ రచయితే గాక నటుడు, చిత్రకారుడిగా ఆర్ట్స్ కళాశాల విశ్రాంత కామర్స్ అధ్యాపకుడిగా విలక్షణ వ్యక్తిత్వంతో ఆయా రంగాల్లో ఔత్సాహికులను ఎందరినో వెన్ను తట్టి బాబూరావు ప్రోత్సహించారు. సభకు ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డబ్ల్యూఏజీకే మూర్తి అధ్యక్షత వహించారు. బాబూరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభలో ఫోరం కార్యదర్శి పిసి సాయిబాబు, లైబ్రేరియన్ ఏ శివాజీ గణేషన్, విశ్రాంత అధ్యాపకులు జి శాంతారామ్, పి ప్రసాద్, మోహన్‌రావు, చిత్రకారుడు జీవి, కవి మల్లికార్జున, న్యాయవాది జడ్ బాషా, రాంగోపాల్, కెవి అప్పారావు, శ్రీధర్ పాల్గొన్నారు.
బాబూరావుకు నివాళి అర్పిస్తున్న దృశ్యం










