Apr 04,2023 01:03
బహుమతులు అందజేస్తున్న మోపిదేవి వెంకట రమణారావు

ప్రజాశక్తి-రేపల్లె: మండలంలోని గంగడిపాలెం పంచాయతీ జొన్నవారిపాలెం స్కూల్‌ గ్రౌండ్‌లో మోపిదేవి రాజీవ్‌ యువ సేన ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న ఉమ్మడి గుంటూరు, కష్ణా జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు మాట్లాడుతూ తీరంలో క్రీడలను ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతో క్రీడాకారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా టోర్నమెంట్‌ నిర్వహణకు రూ.50 వేలను నిర్వాహకులకు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ గాదె వెంకయ్యబాబు, గంగడిపాలెం, రాజుకాల్వ సర్పంచ్‌లు తిరుమలశెట్టి శివాజీ, తలశిల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.