Oct 08,2023 23:51

ప్రజాశక్తి - రేపల్లె
పెనుమల సుబ్బారావు మరణించినా బహుజనుల గుండెల్లో చిరకాలం జీవించిగా ఉంటారని దళిత ఉద్యోగులు ఉద్యమ సంఘాల ప్రతినిధులు కొనియాడారు. ఉప్పూడి రోడ్డులో సుబ్బారావు సంస్మరణ పెదకర్మ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కార్మిక నాయకునిగా, బహుజన నాయకునిగా, జైభీం భారత్ పార్టీ బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా పెనుమల సుబ్బారావు అనేక పోరాటాలలో ప్రత్యక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రంలో తెనాలి మునిసిపల్ కమీషనర్ మెడికొండ జస్వంతరవు, జైభీం భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు దోవా రమేష్ రాంజీ, సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్, అవనిగడ్డ కన్వీనర్ సముద్రాల అంబేద్కర్, న్యాయవాదులు మునిపల్లె సుబ్బయ్య, గుంటూరు విజయ కుమారి, బీఎస్పీ నాయకులు పిల్లి సంపత్ కుమార్, ఇ చెన్నయ్య, నాయకులు దారం సాంబశివరావు, దాసరి ఏడుకొండలు, నీలా జోజిబాబు, భీంరెడ్ కంచర్ల శేషుకుమార్, జూలకంటి బుజ్జి, కర్రా బాబురావు, పోతార్లంక శివ, వెంకటేశ్వరవు, మండే యాకోబు పాల్గొన్నారు.