Oct 09,2023 23:22

ప్రజశక్తి - చీరాల
భారతరాజ్యాగ నిర్మాత డాక్టర్ బిఆర్‌ అంబెడ్కర్ కలలు కన్న బహుజన రాజ్యనిర్మాత మాన్యశ్రీ  కాన్షిరాం అని వక్తలు పేర్కొన్నారు. బిఎస్‌పి వ్యస్తాపకులు మాన్యశ్రీ కాన్షిరాం 17వ వర్ధంతి సందర్భంగా స్థానిక గడియార స్థంభం వద్ద ఉన్న కాన్షీరాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిఎస్‌పి నియోజకవర్గ అధ్యక్షులు గొర్రెపాటి రవి కుమార్, బీఎస్పీ  సీనియర్ నాయకుడు దుడ్డు భాస్కరరావు, కన్వీనర్ కాటి మార్క్ మాట్లాడుతు దేశాన్ని పరిపాలించేది మనువాదులు, డబ్బున్నావారే కాదని నిమ్నజాతులు, వివక్షకు గురి అవుతున్న మహిళలు కూడా పాలించగలరని బిఎస్‌పి ద్వారా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బహుజనులను అధికారానికి తీసుకొచ్చారని అన్నారు. మనువాదుల కోటైన ఉత్తరప్రదేశ్‌లో నాలుగు సార్లు మాయావతిని ముఖ్యమంత్రి చేసిన ఘనత ఆయనదేనని అన్నారు. దేశంలో బహుజనలను ఏకం చేసి ఉద్యోగస్తుల ద్వారా ఒకజాతీయ పార్టీని తాయారు చేసి రాజకీయ అలజడి సృష్టించిన యోధుడని అన్నారు. దేశంలో 85శాతంగా ఉన్న బహుజనులు ఏకమై రాజ్యాన్ని స్థాపించాలని అన్నారు. కార్యక్రమములో బిఎస్‌పి జిల్లా ఇంచార్జ్ చిట్టిమాల సంగీతరావు, నియోజకవర్గ కోశాధికారి చీమకుర్తి వంశీకృష్ణ, కుంచాల పుల్లయ్య, డేనియల్, ప్రసాద్, జగదీష్, శ్రీను, పృథ్వీరాజ్, ఫాస్టర్ దేవ సహాయం, జోసెఫ్, కలాం, షరీఫ్, చిరంజీవి, డి బ్రహ్మయ్య, జగన్మోహన్, ఎం మణిబాబు పాల్గొన్నారు.