Sep 06,2023 20:01

మాట్లాడుతున్న మాల కొండయ్య

ప్రజాశక్తి-కందుకూరు :రాష్ట్రాన్ని రక్షించండి-దేశాన్ని కాపాడండి అనే నినాదంతో సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న బస్సు యాత్ర ఈనెల 8వ తేదీన సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో ముగింపు బహిరంగ సభ జరుగుతుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి మాలకొండయ్య తెలిపారు. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో పి. మాలకొండయ్య మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి పేదలపై అధిక భారాలు మోపుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారన్నారు. సామాన్యులు జీవన విధానానికి ఇబ్బందికరంగా తయారైన పరిస్థితులను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డిని కేంద్రంలో నరేంద్ర మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా తిరుపతిలో సభ నిర్వహిస్తున్నామని, ఆ సభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, రాజ్యసభ సభ్యులు బినరు విశ్వం, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకష్ణ, తదితరులు హాజరైతారని తెలిపారు. సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్‌ బాబు, కార్యవర్గ సభ్యులు షేక్‌ హుస్సేన్‌, మురళి, నత్తా రామారావు పాల్గొన్నారు, ఆదినారాయణ పాల్గొన్నారు.