Nov 14,2023 23:12

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ నేడు విజయవాడలో జరుగుతున్న సిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకుడు ఎం.సుందరబాబు విజ్ఞప్తి చేశారు. స్థానిక బస్టాండు సెంటర్‌ నుంచి అల్లూరి విగ్రహం సెంటర్‌, మెరక వీధి సెంటర్లలో కరపత్రాలను పంపిణీ చేశారు. కేంద్రంలోని మోఢ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం. దొరయ్య, మాణిక్‌ రెడ్డి, హరిబాబు, తిరుమల సూరిబాబు, కాళ్ళ శ్రీనివాస్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.