Nov 13,2023 19:53

కరపత్రాలను పంపిణీ చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి -పెద్దకడబూరు
ఈనెల 15న విజయవాడ బిఆర్‌డిఎస్‌ రోడ్డులోని ఫుడ్‌ జంక్షన్‌లో జరిగే ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.వెంకటేశులు, మండల కార్యదర్శి తిక్కన్న, రైతుసంఘం జిల్లా నాయకులు పరమేష్‌ కోరారు. సోమవారం పెద్దకడబూరు బస్టాండ్‌ ఆవరణలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని ఓడించాలని కోరారు.