కడప అర్బన్ : లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివద్ధి కోసం నవంబర్ 1న జరిగే బహిరంగ సభ ను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్ పిలుపు నిచ్చారు. గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కలవ రపరుస్తున్నాయని తెలిపారు. ఎవరి కోసమో ఎదురు చూసే కన్నా మన బతుకులను, రాష్ట్ర భవిష్యత్తును సక్రమ మార్గాన నడిపి ంచడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్య మించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఈ ఉద్యమంలో సిపిఎంతో ప్రజానీకం భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్ళు పూర్తి కావస్తోందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు పరిశ్రమ లాంటి విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల్ని నిలువునా మోసం చేసిన బిజెపి అంతటితో ఆగకుండా రాష్ట్ర పారిశ్రామికాభివద్ధికి గుండె కాయ.లాంటి విశాఖ ఉక్కును తెగనమ్మడానికి సిద్దమైందని విమ ర్శించారు. అన్నదమ్ముల్లా సమైక్యంగా మెలగవలసిన ప్రజల మధ్య బిజెపి విద్వేషాలు రాజేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ ఏకపక్షంగా నిర్ణయాలను రుద్దుతుందని తెలిపారు. దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్పొరేట్ సేవలో తరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి ద్రోహం చేసి విభజన హామీలకు ఎసరు పెట్టినా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనే ధైర్యం లేనప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజలకు, రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని పేర్కొ న్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో, మోటార్లకు మీటర్లు పేరుతో, ఆస్తిపన్ను నుంచి చెత్తపన్ను వరకు అనేక భారాలు మోపు తున్నారన్నారు. ప్రభుత్వ విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు నామమాత్రంగా తయారవడంతో కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి సామాన్యులు బలైపోతున్నారనరి పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం, అంగన్వాడీలకు, ఆశాలకు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చేసిన వాగ్దానాలన్నీ గాలికెగిరిపోయాయని విమర్శించారు. 1న జరిగే బహిరంగ సభకు సిపిఎం నగర కార్యదర్శి ఎ. రామమోహన్ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ప్రధాన ఉపన్యాసకులుగా ఎం.ఎ.గఫూర్, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె. ప్రభాకర్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఐ. క్రిష్ణయ్య, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె. ఉమామహేశ్వర రావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ప ఉపన్యాసకులుగా రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ఉమామహేశ్వరరావు, సిపిఎం జిల్లా అధ్యక్షులు జి.చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఐ.ఎన్.సుబ్బమ్మ, బి.దస్తగిరిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాసులురెడ్డి, నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, డి.ఎం.ఓబులేసు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో చంద్రారెడ్డి, ఓబులేసు పాల్గొన్నారు. బద్వేలు : స్థానిక సిఐటియు కార్యాలయంలో గురువారం రక్షణభేరికి సంబంధించిన పోస్టర్లను సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1న పట్ట ణంలోని నాలుగు రోడ్ల సెంటర్‌లలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. బద్వేల్ పట్టణ ప్రజలు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్య మేధావులు, కళాకారులు, ప్రజాసంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బద్వేల్ సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు పి.చాంద్ బాషా, పట్టణ కమిటీ సభ్యులు గిలక రాజు, ఎస్.మస్తాన్, బి.కోడూరు మండల కార్యదర్శి ఆర్.ఓబయ్య, సిపిఎం నాయకులు జి.రెడ్డప్ప ,జి.వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.