Sep 13,2023 18:59

మాట్లాడుతున్న సిఐటియు నాయకుడు ఎస్‌ఎ గౌస్‌

ప్రజాశక్తి-కందుకూరు :ఈనెల 14 నుండి 17వ తేదీ వరకు నెల్లూరులో జరిగే ఆల్‌ ఇండియా భవన నిర్మాణ కార్మికుల సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కందుకూరు భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షులు టి ఆదాం అద్వర్యంలో బుధవారం సమావేశం జరిగింది.కందుకూరు సిఐటియు నాయకులు ఎస్‌ఏ గౌస్‌ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కార మార్గాలు, భవన నిర్మాణ రంగ సంక్షేమ బోర్డు ఉన్న పెండింగ్‌ సమస్యలు పరిష్కారంపై ఈ సమావేశాల్లో చర్చిస్తారన్నారు.14వ తేదీ నెల్లూరులో బహిరంగ సభ జరుగుతుందని, జయప్రదం చేయాలన్నారు.