ప్రజాశక్తి - దేవనకొండ
ఈనెల 29న దేవనకొండలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు కోరారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.వీరశేఖర్, సిపిఐ మండల కార్యదర్శి ఎమ్.నరసరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలను నిరసిస్తూ ఈనెల 14 నుంచి ప్రచార భేరి నిర్వహించినట్లు తెలిపారు. ముగింపు నేపథ్యంలో దేవనకొండలో ఈనెల 29న సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్న ముగింపు సభను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ముందుగా బస్టాండ్ దగ్గర నుంచి దేవనకొండలోని సెంటర్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం బహిరంగ సభ ఉంటుందని, ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయి, సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య పాల్గొంటారని చెప్పారు. అన్ని గ్రామాల నుంచి హాజరై విజయవంతం చేయాలని కోరారు. వామపక్ష నాయకులు నెట్టేకల్, వెంకటేశ్వర్లు, మాధవకృష్ణ, రవి, సుల్తాన్, కోదండ, కిరణ్, మస్తాన్, రామాంజనేయులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న వామపక్ష నాయకులు










