Sep 14,2023 19:36

సభకు బయల్దేరిన కార్మికులు

సభకు బయల్దేరిన కార్మికులు
బహిరంగ సభకు తరలిన కార్మికులు
ప్రజాశక్తి-మర్రిపాడు:జిల్లాలో అపరిష్కతంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లాలో జరిగిన బహిరంగ సభకు మండలం నుంచి అధిక సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు తరలివెళ్లారు.మండలంలో చనిపోయిన వారి క్లౖెెయిమ్స్‌ ,ప్రసవమైన మహిళలు దాదాపు 100 క్లయిమ్స్‌ ఉన్నాయన్నారు
. వాటిని వెంటనే పరిష్కరించాలని,కార్మిక శాఖా అకౌంట్స్‌ నుండి ప్రభుత్వం తీసుకున్న రూ.800కోట్లు వెంటనే కార్మిక శాఖకు జమ చేసి పరిష్కరించాలని సిఐటియు మండల కార్యదర్శి బత్తల రత్నయ్య డిమాండ్‌ చేశారు.కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల మండల కార్యదర్శి దండు జాన్సన్‌, మండలంలోని అనేక గ్రామాలు కార్మికులు పాల్గొన్నారు.