Nov 20,2022 00:10

ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి -ఆనందపురం : 'మరుగుదొడ్లను వాడదాం.. బహిరంగ మలవిసర్జన నిర్మూలిద్దాం' అని శనివారం ఆనందపురం హైస్కూల్‌ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచ మరుగుదొడ్లు దినం సందర్భంగా ఆనందపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఆర్డబ్ల్యూఎస్‌ ఈఈ శివప్రసాద్‌ ఆధ్వర్యాన స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌ మాట్లాడుతూ, ప్రతి ఇంటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మరుగుదొడ్లను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. బహిరంగ మలవిసర్జన చేయవద్దన్నారు. బహిరంగ ప్రదేశాలు చెత్త వెయ్య వద్దని కోరారు. ఇంటిలోని తడి పొడి చెత్తను వేరు చేసి గ్రామాల్లో ఉన్న హరిత రాయబారులకు అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ కార్తీక్‌, పంచాయతీ గ్రామ కార్యదర్శి శ్రీరామ్‌మూర్తి (బాబీ), సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.