Mar 21,2023 23:11

 జెసికి రాయనప్పాడు రైతుల వినతి
ప్రజాశక్తి - విజయవాడ రూరల్‌ 

గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి విస్తరణ భాగంగా భూ సేకరణ లో రైతులకు బహిరంగ మార్కెట్‌లో గల ధరను నష్ట పరిహారం గా చెల్లించాలని రైతులు కోరారు. విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి విస్తరణకు అవసరమైన భూ సేకరణకు సంబంధించి విజయవాడ రూరల్‌,రాయనపాడు గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజరు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ రైతులతో ముఖాముఖీ గా మాట్లాడారు. ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌ లో ఎకరా ధర రూ.1.80 కోట్లు ఉందని వివరించారు. అదేవిధంగా సమీప గ్రామమైన జక్కంపూడి లో ఇచ్చిన ధరనైనా చెల్లించాలాని కోరారు. భూ యజమానులు వారి వారి భూమూలకు ఎంత ధర కావాలో నన్న పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణలో సేకరించిన భూములకు రైతులకు ఎటువంటి నష్టం లేకుండా పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. ఏ రైతుకు నష్ట లేకుండా పరిహారం చెల్లిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ హామి ఇచ్చారు. సమావేశంలో భూ సేకరణ విభాగ సూపరింటెండెంట్‌ సిహెచ్‌. దుర్గాప్రసాద్‌, విజయవాడ రూరల్‌ తహశీల్దార్‌ పి. జాహ్నవి, డిప్యూటి తహాశీల్దార్‌ ఏ. రాజేష్‌, మాజీ వైస్‌ ఎం పి పి. కాటాంనేని పూర్ణచంద్రరావు, మాజీ ఎంపిటీసి. చిగురుపాటి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.