ప్రజాశక్తి - తిరువూరు : నియోజకవర్గ అభివద్ధిపై సోమవారం తిరువూరులో బహిరంగ చర్చకు వస్తా మని వైసిపి, టిడిపి నాయకులు చేసిన సవాళ్లకు ప్రతి సవాళ్లకు ఎటువంటి అనుమతులు లేవు సీఐ ఆర్. భీమరా జు తెలిపారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ భావోద్వేగా లతో సవాళ్ళు చేసుకోవటం సరైంది కాదన్నారు. ఇదిలావుండగా సవాల్, ప్రతి సవాల్ నేపథ్యంలో మాజీ ఎమ్మె ల్యే, టిడిపి రాష్ట్ర నాయకులు నల్లగట్ల స్వామిదాస్ ను, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ నల్లగట్ల సుధారాణిని పోలీ సులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే రక్షణనిధి సవాల్ ను స్వీకరించి బహి రంగ చర్చకు రాకుండా ముందస్తు అరె స్టులు చేయించటం పట్ల స్వామిదాస్ మండిపడ్డారు.










