ప్రజాశక్తి-హుకుంపేట: గిరిజనులు పండించిన పంటలకు ఐటిడిఏ ప్రకటించిన ధరకు కొనుగోలు చేయాలని, బెట్టు కాటాలతో గిరిజనులను మోసం చేయవద్దని కాపీ ఈవో టీ.బాలం నాయుడు తెలిపారు. వారసంతల్లో గిరిజనులు అమ్మకానికి తీసుకు వచ్చిన పంటలను పరిశీలించి వ్యాపారస్తులతో మాట్లాడారు. బెట్టు కాటాలతో మోసాలను విడనాడాలన్నారు. గిరిజనులు పండిస్తున్న అన్ని పంటలను సరసమైన ధరలకు కొనుగోలు చేయాలన్నారు. గిరిజనులు పండిస్తున్న కాపీ పండ్లను పాడేరు ఐటిడిఏ సహకారంతో గిరిజన సహకార సంస,్థ ఎకో పల్పింగ్ సంస్థల ద్వారా ప్రతి గ్రామంలో కొనుగోలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాజ్మా చిక్కుళ్ళు కేజీ రూ.100 నుంచి 150, తిప్పలమోడీ రూ.350 నుంచి 400, పసుపు రూ.100 నుంచి 150, చెర్రీ రూ.150 నుంచి 180 వరకు కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. కాపీ పండ్లు కేజీ రూ.36 నుంచి, కాపి గుళ్ల రూ. 135 నుంచి 150, పార్చి మెంట్. రూ. 270 నుంచి 290 చొప్పున కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాపీ లైసెన్ వర్కర్ కే.వాసు దేవుడు, బి.నారాయణ, సత్యానందం, కే.శ్రీను, సత్యనారాయణ, పి.రమేష్ పాల్గొన్నారు.










