ప్రజాశక్తి-బాపట్ల: ఎండల ధాటికి బెట్టకొచ్చిన ఆరుతడి పంటలకు దశలవారీగా నీరందించి కాపాడుకోవాలని బాపట్ల వ్యవసా య శాఖ డిడిఏ విజయనిర్మల రైతులకు సూచించారు. బుధవారం బాపట్ల మండలం ముత్తాయపాలెం పరిసర ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న ఆరుతడి పంటలు మిను ము, రాగి పైర్లు ఎండ వేడి, వడగాల్పులకు బెట్టకొచ్చాయని, ఈ పైర్లకు నీటి తడులు అందించి అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. మండలంలోని ముత్తాయపాలెం, మద్దిబోయినవారిపాలెం ప్రాంతాల్లో వ్యవసాయ పొలాలను సందర్శించారు. పెరలి డ్రెయిన్ నీటి ద్వారా సాగు చేస్తున్న మినుము పైరుపై చీడపీడల నివారణకు 13-0-14 మల్టీకే 1కిలో మందు ద్రావణాన్ని పైరుపై పిచికారీ చేసి నివారించుకోవచ్చన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో సాగుచేసే రాగి పైరుపై ఆశించే అగ్గి తెగులు, కాండం తొలిచే పురుగు నివారణకు క్లోరి ఫైరిఫాస్ అరలీటర్ మందు ద్రావణాన్ని పైరుపై పిచికారీ చేయాలన్నారు. పొలాలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ క్షేత్ర సందర్శనలో వ్యవసాయ శాస్త్రవేత్త సాంబశివరావు, బాపట్ల ఉప్పునీటి పరిశోధన స్థానం శాస్త్రవేత్త మృదుల, ఏడిఏ లక్ష్మి, ఏవో శారద, ఏఈవోలు పాల్గొన్నారు.










