Sep 15,2023 21:38

ప్రజాశక్తి - ఏలూరు
         బెస్ట్‌ ఇంజినీర్‌గా గుర్తింపుపొందిన శ్రీసోమా కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత డాక్టర్‌ సూరత్‌ తేజను ఏలూరు లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ సభ్యులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఇంజినీర్స్‌ డే సందర్భంగా స్థానిక వైభవ్‌పోర్టులోని శ్రీసోమా కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సూరత్‌తేజ మాట్లాడుతూ ఈ సత్కారం తనను ఎంతో ఉత్సాహరిచిందన్నారు. పేదలకు సేవ చేయాలనే తపన, బాధ్యతను రెట్టింపు చేసిందని తెలిపారు. లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు వి.జ్యోతి మాట్లాడుతూ సూరత్‌ తేజ అత్యాధునికంగా నిర్మాణాలు ఎంతో నైపుణ్యంతో చేపడుతూ, అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ఆయన ఆధ్వర్యంలో మరెన్నో అద్భుత కట్టడాలు, సేవా కార్యక్రమాలు చేపట్టి పేదలకు అండగా నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సెక్రటరీ కె.మోక్షలక్ష్మీకుమారి, ట్రెజరీ ఎం.రాధికారాణి పాల్గొన్నారు.