ప్రజాశక్తి - ఏలూరు అర్బన్ : బెన్నీ రెడ్‌క్రాస్‌కు అందించిన సేవలు మరువలేనని, ఆయన సూచనలు, సేవలు భవిష్యత్తులో కూడా రెడ్‌క్రాస్‌కు కావాలని రెడ్‌క్రాస్ ఛైర్మన్ బివి.కృష్ణారెడ్డి కోరారు. జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శిగా రెండు సంవత్సరాలు విశేష సేవలు అందించి, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన బోడపాటి బెన్నీని జిల్లా రెడ్‌క్రాస్ కార్యాలయంలో ఛైర్మన్ బివి.కృష్ణారెడ్డి, రెడ్ క్రాస్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ బెన్నీ స్థానంలో రెడ్‌క్రాస్ కార్యదర్శిగా పెనుమంట్ర రిటైర్డ్ తహశీల్దార్ కెబి సీతారాంకు బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొన్నారు. బెన్నీ మాట్లాడుతూ రెండు సంవత్సరాల విధి నిర్వహణలో తనకు సహకరించిన ఛైర్మన్ కృష్ణారెడ్డికి, రెడ్‌క్రాస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. తన సేవలు రెడ్‌క్రాస్‌కి ఎప్పుడు కావాల్సిన ఉపయోగించుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్‌ఎస్‌ఆర్‌కె వరప్రసాదరావు, రెడ్‌క్రాస్ సిబ్బంది జి.జ్ఞాన వేణి, ఎ.ప్రియాంక, సిహెచ్.అనూష, ఎ.సూర్యనారాయణ, కెవి.రమణ, తదితరులు పాల్గొన్నారు.










