నినాదాలు చేస్తున్న గ్రామస్తులు
బెల్ట్ షాపులతో ఇబ్బందులు..
బెల్ట్ షాపులు వద్దంటూ మహిళలు ఆందోళన
ప్రజాశక్తి-వరికుంటపాడు :మండలంలోని విరువూరులో మద్యం బెల్ట్ షాపులు తొలగించే చర్యలు తీసుకోవాలంటూ శనివారం సచివాలయం వద్ద గ్రామస్తుల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్ట్ షాపులకు పోలీసులు, సెబ్ సిబ్బంది సహకరిస్తున్నారంటూ గ్రామస్తుల ఆరోపణలు చేశారు. పుట్ట గొడుగుల్లా బెల్టు షాపులు
గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలతో కష్ణంరాజు పల్లి, తూర్పు బోయమడుగులలో తెల్లవారక ముందే మందు బాబుల చిందులు వేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిండికేట్ గా మారిన మద్యం వ్యాపారులు
అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీనికి తోడు పోలీసులు కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు గ్రామాల్లో మద్యం విక్రయాలు గుట్టు చప్పుడు కాకుండా మద్యం జోరు ఎక్కువగా ఉందాని వాపోయారు. బ్రాండెడ్ మద్యాన్ని కల్తీ చేస్తూ మద్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరుపుతున్న వ్యక్తులను పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయగ గుట్టు చప్పుడు కాకుండా మద్యం విక్రయాలు జరుగుతునట్లు తెలుస్తోంది. అధికారులు తనిఖీలు చేయక పోవడమే ఇందుకు కారణమని ప్రజల నుంచి విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నామకర్ధంగా వచ్చి తూతూ మంత్రంగా తనిఖీ చేసి ఏమి దొరకలేదని స్టేట్మెంట్ తీసుకొని వెళ్లిపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మద్యం అంతా ప్రకాశం జిల్లా పామూరు నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు జరిపే వాళ్లకి సరఫరా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువగా ఒక్కో బాటిల్ పై 10నుంచి 20 రూపాయల అదనంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే ఆసరాగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ను బట్టి 50 నుంచి 60,70 రూపాయల కి విక్రయాలు జరుపుతూ మందుబాబుల జేబులు గుల్ల చేస్తున్నారు. మొత్తంగా బెల్ట్ షాపుల నిర్వహణ చట్ట విరుద్ధమైనప్పటికీ అటు ఎక్సైజ్ అధికారులు , పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరించడంతో పల్లెల్లోనూ మద్యం వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ విధంగా మద్యం విక్రయాలు చేస్తూ మందుబాబుల జేబులు ఖాళీ చేస్తు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విరువూరు గ్రామస్తులు కోరారు.










