Jun 28,2023 23:50

తాడికొండ: బెల్ట్‌ షాపులను నిర్మూలించాలని ఎక్సైజ్‌ అధికారు లకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని పొన్నెకల్లు గ్రామ అభివద్ధి కమిటీ అధ్యక్షులు పప్పులు సీతా రామరెడ్డి అన్నారు. బుధవారం గ్రామ వైసీపీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారామరెడ్డి మాట్లాడుతూ పొన్నెకల్లులో పదికి పైగా బెల్ట్‌ షాపులు ఉన్నాయని అన్నారు. పోలీసులకు, ఎక్సైజ్‌ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో మద్యం షాపును స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వలన బండారుపల్లి గ్రామానికి తరలించడం జరిగిందన్నారు. స్థానికంగా మద్యం షాపు లేకపోవడంతో కొనుగోలు దారులు తాడికొండ,లామ్‌,బండారుపల్లి,రావెల గ్రామాల నుండి మద్యం తీసుకొచ్చి బాటిల్‌ పై వంద రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నా రని అన్నారు. గ్రామంలో 24 గంటలు మందు అందుబాటులో ఉంటోందన్నారు. ఎక్సైజ్‌ పోలీస్‌ అధికారులు మామూలు దండుకొని తూతూ మంత్రం చర్యలు తీసుకోవడం విమర్శలకి తావిస్తుందని అన్నారు. బెల్ట్‌ షాపులపై ప్రభుత్వం స్పందించకుంటే జూలై 8వ తేదీన పొన్నెకల్లు నుండి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వ హిస్తామని అన్నారు. రాజకీయ నాయకుల అండ దండలతో అడ్డరోడ్డు రెస్టారెంట్‌ అండ్‌ బార్‌ నిర్వా హకులు మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని విమ ర్శించారు. సమావేశంలో ఉప సర్పంచ్‌ పల్లా విజయ లక్ష్మి ,వైసిపి నాయకులు చింతల భాగ్యరావు కన్న బోయిన నాగయ్య గుర్రం హనుమంతరావు పల్లా సుబ్బయ్య దొడ్ల విజయ షేక్‌ ఖాసిం పాల్గొన్నారు