Feb 26,2023 23:30

బెల్లాన్ని పరిశీలిస్తున్న జెడ్‌పిటిసి మత్స్యలింగం

ప్రజాశక్తి-హుకుంపేట:ఏజెన్సీ ప్రాంతాల్లో తయారవుతున్న నాణ్యమైన బెల్లాన్ని మార్కెట్లో అనుమతించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడతానని జెడ్పిటిసి రేగం మత్స్య లింగం అన్నారు. మండలంలోని దుర్గం, మత్య్సపురం పంచాయతీ నిట్టపుట్టు, ఉప్ప, తదితర ప్రాంతాల్లో గిరిజనులు పండిస్తున్న బెల్లంను జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం ఆదివారం పరిశీలించారు. బెల్లంకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తెలియ చేస్తానని తెలిపారు. తాము ఎంతో శ్రమించి కష్టపడుతున్నా గిట్టుబాటు ధర రాలేదని రైతులు అన్నారు. అనంతరం జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం మాట్లాడుతూ, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కల్తీ బెల్లాన్ని కొనుగోలు చేయకుండా రైతుల దగ్గర కొనుగోలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి నైని సత్తిబాబు, దుర్గం మాజీ ఎంపీటీసీ ఒరబొయిన బాలన్న, ఒల్డ పంచాయతీ ఉప సర్పంచ్‌ అప్పలస్వామి, నారాయణ పాల్గొన్నారు.