May 09,2023 23:31

కరప తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న జిల్లా టిడిపి నాయకులు



టిడిపి ఆధ్వర్యంలో ధర్నా

ప్రజాశక్తి - యంత్రాంగం
టిడిపి రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ముఖ్య కేంద్రాల్లో నిబంధనలు లేకుండా, రైతు భరోసా కేంద్రాల్లో పంట నష్టపోయిన రైతుల నుంచి తడిసిన, రంగు మారిన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ తెలుగు దేశం నాయకులు, కార్య కర్తలు ధర్నాలు, రాస్తారోకోలు చేసిన నిరసన తెలియజేశారు. అనంతరం ప్రభుత్వాధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
కరప లో కాకినాడ జిల్లా టిడిపి నాయకులు, కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి ఆనంతలక్ష్మి ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయం నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. దెబ్బతిన్న ధాన్యం గింజలతో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన అనంతరం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తడిసిన ధాన్యాన్ని నిబంధనలు సడలించి మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్‌, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారా యణ మూర్తి, మాజీ ఎంఎల్‌సి చిక్కాల రామచంద్రరావు, ని కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్‌ సీనియర్‌ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్‌, వాసిరెడ్డి ఏసుదాసులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస బాబా, మండల టిడిపి అధ్యక్షుడు దేవు వెంకటేశ్వర రావు, నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. తొలుత నాయకులు కీ.శే. ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కాకినాడ కార్పొరేషన్‌ కాకినాడ నగర టిడిపి ఆధ్వర్యంలో కాకినాడ అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఎన్నికల తహశీల్దార్‌ సిహెచ్‌ లక్ష్మీప్రసన్నకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నగర టిడిపి అధ్యక్షుడు మల్లిపూడి వీరు, శీకోటి అప్పలకొండ, చింతలపూడి రవి, అన్సర్‌, బంగారు సత్యనారాయణ, జొన్నాడ వెంకటరమణ, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.జగ్గంపేట రూరల్‌: కిర్లంపూడి మండల తహశీల్దార్‌ కార్యాలయంలో మండల టిడిపి అధ్యక్షుడు చదరం చంటిబాబు ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు మంగళ వారం ఆందోళన నిర్వహించి తహశీల్దార్‌ కె.వి మాధవరావుకి వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రి స్థానంలో ఉండి కష్టపడి పంట పండిస్తున్న రైతులను అవమానిస్తూ సంబోధించడం సమంజసం కాదన్నారు. మండల టిడిపి అధ్యక్షుడు చదరం చంటిబాబు, భూపాలపట్నం సర్పంచ్‌ వీరం రెడ్డి కాశిబాబు, గుడాల రాంబాబు, కుర్ల చినబాబు, మాదిరెడ్డి సూరి బాబు, అడారి నానాజీ, కంచుమర్తి రాఘవ, సూరిశెట్టి వెంకట శివ, రాయుడు బాబురావు పాల్గొన్నారు తాళ్ళరేవు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట టిడిపి నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ ఎం.సూరిబాఋకి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహక కార్యదర్శి ధూళి పూడి వెంకటరమణ, రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు పొన్న మండ రామలక్ష్మి, అమలాపురం పార్ల మెంటు బిసి సెల్‌ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు, ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు కొత్తూరు కాశీ, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు. గండేపల్లి తహశీల్దార్‌కి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ అడబాల భాస్కరరావు, నాయకులు కంటిపూడి సత్తిబాబు, యలమాటి కాశి, పి.వెంకటేశ్వరరావు, యర్రం శెట్టి బాబ్జి, కొండ్రు అప్పల రాజు, పనుమర్తి భాస్కరరావు, వెంపాటి రాజు, చిటికెల కన్నబాబు, ముంగర సూర్యరావు, బొండా శ్రీనుబాబు, కంటిపూడి జెమ్మి పాల్గొన్నారు.