Jul 21,2022 23:07

ఆపరేషన్‌ పూర్తయిన పిల్లలతో గాయత్రి వైద్యబృందం

ప్రజాశక్తి- పిఎం.పాలెం: కొమ్మాది సమీపంలోని గాయత్రి విద్యాపరిషత్‌ మెడికల్‌ కాలేజీలో పుట్టుకతో చెవిటి, మూగ పిల్లలకు అరుదైన చికిత్స నిర్వహించినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అనే చికిత్స ద్వారా పుట్టుకతో వచ్చిన చెవిటి, మూగ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా రూ. ఏడు లక్షల నుంచి రూ.ఎనిమిది లక్షల విలువైన అరుదైన ఆపరేషన్‌ను ఐదేళ్లలోపు వయస్సున్న ఆరుగురు పిల్లలకు ఇప్పటివరకు ఉచితంగా చేశామన్నారు. దీనికోసం అరవై లక్షలు ఖర్చయ్యిందని, అదంతా గాయత్రి సంస్థ పెట్టుకుందన్నారు. ఆపరేషన్‌ భాగంగా రోగికి బయోటెరియల్‌ రెండువైపులా కాక్లియర్‌ ఇంప్లెంట్‌ అమర్చామని, ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఒక్క గాయత్రీలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆపరేషన్‌ జరిగిందన్నారు. ఈ సర్జరీలను డాక్టర్‌ ఎస్‌కెఇ.అప్పారావు, విజిటింగ్‌ ప్రొఫెసర్‌ మెంటర్‌, డాక్టర్‌ సూర్య ప్రకాశరావు, ఇఎన్‌టి హెచ్‌ఒ డాక్టర్‌ డిఆర్‌కెఎల్‌ఎన్‌ రాజు, ఇఎన్‌టి ప్రొఫెసర్లు డాక్టర్‌ శ్రీనివాసరావు డాక్టర్‌ నిహారిక, డాక్టర్‌ విహారి, డాక్టర్‌ సౌమ్య, మత్తుమందు డాక్టర్లు డాక్టర్‌ కూర్మనాథ్‌ బృందం ఆ పరేషన్లను విజయవంతంగా నిర్వహించిందన్నారు. ఆపరేషన్‌ తర్వాత ఆడియాలజీ, స్పీచ్‌ థెరపిస్ట్‌ లక్ష్మీపతి, సంపత్‌, ఎం.సుచరిత ఆధ్వర్యంలో స్పీచ్‌ థెరపీ నిర్వహించినట్లు తెలిపారు. వీటితోపాటు సిఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా రెండు కాక్లియర్‌ ఇంప్లెంట్‌ సర్జరీలు డాక్టర్‌ ఎంవి అప్పారావు, డాక్టర్‌ సుబ్బారాయుడు, డాక్టర్‌ సూర్యప్రకాష్‌, డాక్టర్‌ ఆర్‌కెెఎల్‌ఎన్‌ రాజు అధ్వర్యంలో నిర్వహించినట్లు వెల్లడించారు.