రోడ్డు ఎక్కితే
తనువు ఛిద్రం
అడుగుకో గుంత
గజానికో గొయ్యితో
బాటలన్నీ
''మృత్యు''దారులకు
చిరునామాలే
నరకానికి నకళ్ళే
నున్నగా ఉండాల్సిన
రహదారులకు
అధికారమే పరమావధైన
నాయకగణం
అనుచిత
''అనాలోచిత'' పందేరాలు
శాపంగా మారి
తిరోగమనం
చంకనెక్కి కూకోగా...
గాలిలో దీపాలుగా మారిన
''ప్రాణాలు''
అరచేతిలో పెట్టుకొని
పయనిస్తున్న బాటసారి
భవిష్యత్‌పై పెట్టుకొన్న ఆశలు
ఛిద్రమైన రోడ్లపై
జీవచ్ఛవంలా నిలబడ్డాయి
అధికారమివ్వడమే
శాపంగా మారగా
''పాలించను వచ్చారా
భక్షించను గెలిచారా
స్వార్ధానికి ప్రజల బతుకులను
బుగ్గిచేయ దలిచారా''
అని మధనపడే
జనకోటి వేదనకు బదులేది?
వేమూరి శ్రీనివాస్
99121 28967