Dec 15,2022 23:14

సమస్యలను తెలుసుకుంటున్న డాక్టర్‌ లక్ష్మీనర్సింహా

ప్రజాశక్తి -కంచరపాలెం : ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనార్టీల సంక్షేమానికి సబ్‌ప్లాన్‌ అమలుతో పాటు వారికి సబ్సిడీ రుణాలు అందజేయాలని ఎపి బిసి సంక్షేమ సంఘం కన్వీనర్‌ డాక్టర్‌ సనపల లక్ష్మీనర్సింహా అన్నారు. గురువారం 51వ వార్డు అంబేద్కర్‌నగర్‌, వుడా కాలనీ, మాధవధార తదితర ప్రాంతాల్లో జనజాగృతి యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఆర్‌అండ్‌బి జంక్షన్‌ వద్ద పైడితల్లమ్మను దర్శించుకున్నారు. అంబేద్కర్‌ నగర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనజాగృతియాత్రలో సమీకరించిన సమస్యల పరిష్కారానికి సిఎం జగన్‌ను కలిసి నివేదిస్తానని వెల్లడించారు.