కడప అర్బన్ : జిల్లాలోని బడుగు, బలహీనవర్గాల అభ్యుదయం కోసమే లయన్స్ క్లబ్ ఏర్పాటైందని తన కార్యవర్గం ప్రక టించింది. లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆదివారం స్థానిక మానస ఇన్ హోటల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ పి. ఖాసిం ఖాన్ మాట్లాడుతూ ప్రజల్లో సేవాభావాన్ని పెంచేందుకే క్లబ్ ఏర్పాటైందన్నారు. సంస్థ నిర్వహణకు తన వంతు సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పారు. లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ కె. చిన్నప రెడ్డి ప్రధాన ప్రసంగం చేస్తూ ప్రజలకు ప్రభుత్వం ఎంతో సహాయం చేస్తోందని, తమ వంతుగా మానవత్వాన్ని చాటుకొంటూ క్లబ్బు కొత్త కమిటి మరిన్ని సేవలు అందించనుందని వివరించారు. లయన్స్ పాస్ట్ గవర్నర్లు సిహెచ్. రమేష్‌నాథ రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం, ప్రతిజ్ఞ చేయించగా, లయన్ డాక్టర్ ఎం. సుధాకర రెడ్డి నూతన సభ్యులను సభకు పరిచయం చేశారు. లయన్స్ ప్రముఖులు కె. కష్ణమూర్తి, షేక్ అబ్దుల్లా, జి. గుల్జార్ బాషా, పి.ఎస్. హరినాథ రెడ్డి, పి.వి. రమేష్‌లతో పాటు అన్ని క్లబ్బుల అధ్యక్షులు ప్రత్యేక అతిథులుగా హాజరై ప్రసంగించారు. అధ్యక్షులు డాక్టర్ ఆర్. రంగనాథ రెడ్డి, కార్యదర్శి వి. గౌరీ శంకర్, లయన్ గునిశెట్టి శ్రీనివాసుల పర్యవేక్షణలో నూతన కమిటీ అధ్యక్షునిగా పోతుల వెంకట్రామి రెడ్డి, ఉపాధ్యక్షులుగా వలికల గౌరీ శంకర్, కారపురెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి, కార్యదర్శిగా కొండూరు జనార్దన రాజు, సహ కార్యదర్శిగా బోగాల కొండా రెడ్డి, కోశాధికారిగా దేవతి రవీంద్రనాథ్, సహ కోశాధికారిగా ముకేష్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకొ న్నారు. అనంతరం వివిధ విభాగాల చ్కెర్మన్లుగా తొమ్మిది మంది వ్కెద్యులను, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను, 16 మందిని బోర్డు ఆఫ్ డ్కెరెక్టర్లుగా ఎన్నుకొన్నారు.










