ప్రైవేట్ అయినా
సర్కారు అయినా
తరగతిగది ఒక్కటే.
కరోనా కష్టకాలంలో
ప్రైవేట్ ఉపాధ్యాయులు
భుక్తికోసం చేపలమ్మారు
కూరగాయలమ్మారు
ఆత్మాభిమానం చంపుకొని
పొట్టకోసం ఎన్నో మరెన్నో...
యాజమాన్యం పట్టించుకోదు
సర్కారూ పట్టించుకోదు
వారి జీవితాలకు దారేది?
ప్రభుత్వపెద్దల్లారా
ఎందరికో వరదానాలు చేశారు
వీరివైపు కన్నెత్తి చూడరే?
ఇదా సమాజ నిర్మాతలకు
మనమిచ్చే గౌరవం?
ఇదేనా 'గురుపూజాదినోత్సవ' లక్ష్యం?
ఏనాడో చెప్పాడు ఆంధ్రకేసరి
సన్మానాలు అన్నంపెట్టవని
వాటితో కడుపునిండదని
ఉపాధ్యాయ దినోత్సవం నాటి
గౌరవ, ఆరాధనలు
ఎల్లవేళలా దృశ్యమానం కావాలి
పొగచూరిన గురుభక్తి
పునర్వైభవం సంతరించాలి
వేమూరి శ్రీనివాస్
99121 28967