Aug 10,2023 22:13

ప్రజాశక్తి - ఉండి
బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం టిడిపి పార్టీతోనే సాధ్యపడుతుందని ఎంఎల్‌ఎ మంతెన రామరాజు తెలిపారు. గురువారం ఉండి పడవలరేవులో మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు వత్సవాయి సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళాశక్తి కార్యక్రమంలో పాల్గొన్న రామరాజు మాట్లాడుతూ టిడిపి ఆవిర్భవించిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజకీయాలలో చోటు దక్కిందని తెలిపారు. అప్పటినుండి బడుగు బలహీన వర్గాలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా పనిచేశారన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల నాయకులకు సముచిత స్థానం దక్కుతుందన్నారు. ప్రభుత్వం బీసీలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని కానీ వాటికి నిధులు మంజూరు చేయలేదన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత మహిళలకు ఇప్పటికంటే అధికంగా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అనంతరం భవిష్యత్తుకు భరోసా కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కన్నెగంటి రూత్‌ కళ, నియోజకవర్గ యువత అధ్యక్షుడు చెన్నంశెట్టి హరినాయుడు, ఎంపిటిసి కునుకు రమాదేవి శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు.
మొగల్తూరు : పేదలకు, మహిళలకు అండగా ఉండేది ఒక్క టిడిపినే అని ఆ పార్టీ నరసాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు అన్నారు. కెపిపాలెం నార్త్‌లో మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. రాజమండ్రి మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు