కడప : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయానికి ప్రాధాన్యతమిస్తూ రైతేరాజు ఒక పండగలా ఉండాలని ప్రతి బడుగు బలహీన దళిత రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్‌సి సేవా సహకార సంఘం, కడప వారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన (పిఎంఎజెఎవైౖ) పథకం ద్వారా ప్రకతి వ్యవసాయం చేయుచున్న ఎస్‌సి రైతులకు విత్తన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వంలో రైతాంగానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నా మన్నారు. రైతు భరోసా కేంద్రాలు, స్టోరేజీలు, శీతలీకరణ స్టోరేజీలు రైతులకు ఏర్పాటు చేశామని తెలిపారు. చుక్కల భూములను తొలగిస్తూ పేదలకు యాజ మాన్య హక్కుతో పంపిణీ చేశామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పరిపాలన సాగిస్తు న్నారన్నారు. పిఎండిఎస్ కిట్టు కింద జీలగలు, పిల్లి పెసర, జనుములు, రాగి, కోర్ర, సజ్జలు, మినుములు, పెసలు, కందులు, సీడ్ టు సీడ్ కిట్టు కింద కందులు మొక్కజొన్న, జొన్నలు, సజ్జలు, కందులు, పెసలు మరియు కిచెన్ గార్డెన్ కిడ్స్ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఒక్కొక్క ఎస్సీ రైతుకు రూ.7630 విలువ కలిగిన ఇతర అవసరమైన వ్యవసాయ ఉపకరణములు, పేరామిన్ ట్రాప్స్, లూర్సు, ఎల్లో స్టికి ప్లేట్స్, టార్పా లిన్స్, డ్రమ్ములు మొదలగునవి తదుపరి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. అనంతరం మంత్రి సురేష్ చేతుల మీదుగా విత్తన కీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వి.విజరు రామరాజు, శిక్షణ కలెక్టర్ రాహుల్ మీనా, ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీనివాసులు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పి.శివ ప్రసాద్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి డాక్టర్ వెంకట సుబ్బయ్య, డిపిఎం పి.రామకృష్ణరాజు, అదనపు డిపిఎం వసంత కుమారి పాల్గొన్నారు.










