బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే
- ఎంపీ, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు
- జిల్లా వ్యాప్తంగా పూలే జయంతి వేడుకలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే అని, ఆయన ఆశ సాధనకు ప్రతి ఒ్కరూ కృషి చేయాలని, ఆయన సేవలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. నంద్యాల జిల్లాతో పాటు జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతిని జిల్లా అధికార యంత్రాంగం, పలువురు ప్రజాప్రతినిధులు, బిసి, దళిత సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు నివాళ్లులర్పించారు. నంద్యాలలోని పద్మావతి నగర్ సర్కిల్‌లో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, డిఆర్‌ఓ బెజ్జం పుల్లయ్యలు పూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎంపీ మాట్లాడుతూ నంద్యాల నూతన జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధికి పూలే చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా మాట్లాడుతూ అప్పట్లో మహిళలు విద్యావంతులైతే దేశం అభివృద్ధి చెందుతుందని మొదట తన సతీమణికి విద్య నేర్పించి మహిళా ఉపాధ్యాయురాలిగా పూలే తీర్చిదిద్దారన్నారని అన్నారు. బాలికలకు మహిళా పాఠశాల ఏర్పాటు చేసి తన భార్య ద్వారా విద్య నేర్పించారని చెప్పారు. ఈ వేడుకల్లో అధికారులు, జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు చిటికెల సలోమి, వివిధ సంఘాల నాయకులు మంజుల, సుబ్బరాయుడు, బాలకృష్ణ యాదవ్, మద్దయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో : జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళ్లులర్పించారు. ఎఎస్‌పి ఆర్.రమణ, జి.చంద్రబాబు, ఆర్‌ఎస్‌ఐలు సోమశేఖర్, వీరన్న, హర్షవర్ధన్ రెడ్డి ,అల్లా వుద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.
టిడిపి ఆధ్వర్యంలో : టిడిపి నంద్యాల నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి తన నివాసంలో పూలే చిత్రపటానికి, అలాగే స్థానికపద్మావతి నగర్‌లోని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులుఅర్పించారు. బిసి నాయకులు, వార్డ్ ఇంచార్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే బిసి సెల్ నంద్యాల డివిజన్ విభాగం అధ్యక్షుడు సుబ్బారాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు పరమేష్ ఎన్నికైనందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో : పద్మావతి నగర్ ఆర్చి దగ్గర గల పూలే విగ్రహానికి ఎపి పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు, పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్యలు నివాళులర్పించారు. ఎపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఊకొట్టు వాసు, జిల్లా బిసి కమిటీ అధ్యక్షులు వడ్డే రామకృష్ణ, జిల్లా ట్రెజరర్ ఎస్‌వైడి ప్రసాద్, ఎస్సీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కరాటే బాలకృష్ణ, ఆనందరావు, కృష్ణ, మైనారిటీ నాయకులు చాబోలి సలాం పాల్గొన్నారు.
ఆర్‌టిసి డిపోలో : నంద్యాల ఆర్‌టిసి డిపోలోని గ్యారేజ్‌లో జిల్లా ప్రజా రవాణా అధికారి టి.శ్రీనివాసులు పూలే చిత్ర పటానికి నివాళ్లులర్పించారు. డిపో మేనేజరు ఏ.గంగాధర రావు, అసిస్టెంట్ మేనేజర్ మద్దిలేటి నాయుడు, అసోసియేషన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
బనగానపల్లె : పట్టణంలోని బిసి సంఘం కార్యాలయంలో బిసి సంఘం, యాదవ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. బిసి సంఘం జిల్లా నాయకులు సిద్ధపు పాండురంగ యాదవ్, అఖిలభారత యాదవ మహాసభ బనగానపల్లె నియోజకవర్గ కన్వీనర్ మద్దయ్య యాదవ్, దూదేకుల సంఘం నియోజకవర్గ అధ్యక్షులు స్టైల్లో టైలర్ దస్తగిరి, గిరిజన సంఘం నాయకులు కోనేటి శ్రీనివాసులు, నందవరం సర్పంచి నాగరాజు, యాదవ, బిసి సంఘాల నాయకులు కొంగని పవన్ కుమార్, సాదు కొట్టం మహేష్ యాదవ్, లింగాల దేవేంద్ర యాదవ్, కైప సుధాకర్ యాదవ్, నందవరం శ్రీనివాసులు, టైలర్ మౌలాలి, వెంకటాపురం శ్రీనివాసులు, నాగేంద్ర పాల్గొన్నారు. కొత్తపల్లి : కొత్తపల్లిలో, సింగరాజు పల్లె, గుమ్మడాపురం గ్రామాల్లో జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. ఆత్మకూరు ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగన్న, కస్టమ్స్ అధికారి వేల్పుల జయ ఆనంద్ కుమార్, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.స్వాములు, కెవిపిఎస్ జిల్లా నాయకులు ఎన్.సంపత్‌లు నివాళ్లులర్పించారు.కార్యక్రమంలో సర్పంచి నక్క విజరు కుమార్, బాల ఎల్లయ్య, ఉప సర్పంచి బొల్లు శ్రీనివాసులు యాదవ్, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు బొల్లు ప్రసాద్ బాబు యాదవ్, బిసి నాయకులు నాగ శేషన్న, నాగేశ్వర యాదవ్, లింగ స్వామి గౌడ్, శంకర్ గౌడ్, నారాయణ, సుబ్బరాయుడు, ఇద్రుస్, బంగి నాగన్న, రవికుమార్, సూరి, రాజు, వెంకటరమణ, ఆనంద్, గోపాల్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. చాగలమర్రి : పట్టణంలోని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో టిడిపి బీసీ సెల్ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ సల్లా నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో పూలే జయంతి నిర్వహించారు. సంఘం ఉపాధ్యక్షులు బాల దస్తగిరి, నాయకులు బ్రహ్మయ్య, ఆచారి, నీలం ధనుంజయుడు, ఫకృద్దీన్, లాలు, ఉసేని పాల్గొన్నారు.

మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న బీసీ సంఘం నాయకులు










