Apr 11,2023 17:08

మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే
ప్రజాశక్తి - ఆత్మకూర్

     బడుగు, బలహీన వర్గాలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని సిపిఎం పట్టణ కార్యదర్శి రణధీర్, నాయకులు రామ్ నాయక్ అన్నారు.  మంగళవారం పట్టణంలోని ధనుంజయ మీటింగ్ హాల్ నందు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే  గొప్ప సంఘసంస్కర్త, సామాజికవేత్త, సామ్యవాది అణగారిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు. శూద్రులకు విద్యను నిరక్షరాస్యతను పారద్రోలే గొప్ప దార్శనికుడు ఆనాడే అంటరానితనాన్ని ఎదిరించిన గొప్ప పోరాట యోధుడు అని ఆయన ఆశయాలు ముందుకు తీసుకు పోవడం కోసం ప్రస్తుతం ప్రమాదంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.  బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం రాజ్యాంగ వ్యవస్థలను సర్వనాశనం చేసి కుల వ్యవస్థను పెంచి పోషించే విధంగా మనుధర్మ శాస్త్రాన్ని భారత రాజ్యాంగం స్థానంలో అమలు జరపాలని ఆర్ఎస్ఎస్, బిజెపి ప్రయత్నిస్తున్నాయి ఈ కుట్రలను అన్ని వర్గాల ప్రజలు చైతన్యం తో తిప్పి కొట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రఫిక్, రైట్ భాష, మా భాష, మియాస, శేషయ్య, షఫీ, హుస్సేన్ షా, తదితరులు పాల్గొన్నారు.