Jun 05,2023 01:52
మాట్లాడుతున్న విక్టర్‌ ప్రసాద్‌

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌సి కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాదు పేర్కొన్నారు. మండల కేంద్రమైన నాగులుప్పలపాడు బస్టాండ్‌ కూడలిలో అంబేద్కర్‌ మిషన్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు శనివారం రాత్రి శంఖుస్థాపన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాలడగు విజేంద్ర అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న విక్టర్‌ ప్రసాదు మాట్లాడుతూ అంబేద్కర్‌ స్ఫూర్తితో రాజ్యాధికారానికి అడుగులు వేయాల న్నారు. ఇప్పటికైనా రాజ్యాధికారం రావాలంటే అందరు ఐక్యంగా ఉండి దళిత పేటల్లో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేయాలని, వారికి అండగా నిలిచినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవు తుందని అన్నారు. అంబేద్కర్‌ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారన్నారు. ఆయన రచించిన రాజ్యాంగంతోనే అనేక తరగతుల వారు ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. అంబేద్కర్‌ అందరివాడే తప్ప కేవలం ఎస్‌సిలకు చెందిన వాడు కాదని ఈ సందర్భంగా తెలిపారు. బడుగు బలహీనవర్గాల ముక్కలుగా ఉన్నవారంత ఐక్యం కావాలని పిలుపునిచ్చారు కెవిపియస్‌ జిల్లా ప్రదాన కార్యదర్శి బి రఘరామ్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ విగ్రహల ఏర్పాటు నేపద్యంలో 1235జిఓ ప్రకారం ప్రతి దళిత పేటల్లోఋ2ఏకరాలు స్మశానికి కేటాయించ వలసి ఉందని కాని ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదన్నారు నాగులుప్పలపాడు మండలంలో అనేక చోట్ల స్మశాన స్దలాలు లేవని తెలిపారు. అందుకు కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న ప్రసాదు కృషి చేయాలని కోరారు. అందుకు స్పందించిన ఆయన ఇటీవలనే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతి జిల్లా కలెక్టర్లకు శ్మశాన స్థలాలు కేటాయించాలని జిఓ జారీ చేసినట్లు తెలిపారు. ఆ దిశగా మండలంలో కూడా దళితపేటల్లో శ్మశాన స్థలం లేనిచోట స్థలం కేటాయించాలని స్టేజీ మీద ఉన్న ఇన్‌చార్జి తహశీల్దార్‌ జయలక్ష్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో దాసరి చెన్నకేశవులు, చప్పిడి వెంగళరావు, నిర్వాహకులు జి సుబ్బారావు, తహశీల్దార్‌ ఎన్‌ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.