కార్యక్రమాలు చేపట్టారు.
ప్రజాశక్తి-యంత్రాంగం
అనకాపల్లి: కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ ఇప్పటికే వ్యవసాయం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవాల్సింది పోయి ఎరువుల ధరలపై రూ.50 వేల కోట్లు పెంచడం దారుణమన్నారు. రైతు సంఘాల జిల్లా కన్వీనర్ పిఎస్.అజరు కుమార్ మాట్లాడుతూ రైతు కూలీలకు ఉపాధి కల్పిస్తూ, భూగర్భ జలాల పెంపుకు ఉపయోగపడుతున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా దానికి రూ.30 వేల కోట్లు కోత విధించడం దుర్మార్గమన్నారు. ఏపీ రైతు సంఘం నాయకులు కే శంకర్రావు, వైఎన్ భద్రం, కిసాన్ కాంగ్రెస్ నాయకులు కత్తెర శ్రీధర్, కొండలరావు, వ్యవసాయదారుల సంఘం భీశెట్టి కృష్ణ అప్పారావు, ఆమ్ ఆద్మీ నాయకులు కొణతాల హరినాథ్ బాబు, రైతు స్వరాజ్య వేదిక నాయకులు బాలు గాడి మాట్లాడుతూ కేంద్ర ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఆమోదిస్తే రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు పెరుగుతాయని తెలిపారు. రైతు సంఘాల నాయకులు ఏడుకొండలు, కాళ్ళ తేలయ్య బాబు, బాలాజీ, సిఐటియు నాయకులు చలపతి పాల్గొన్నారు.
మునగపాక రూరల్ : బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని, రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సిఐటియు జిల్లా కోశాధికారి వివి.శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు డిమాండ్ చేశారు. స్థానిక మెయిన్ రోడ్‌లో బ్లాక్ డేలో భాగంగా రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఢిల్లీ రైతు ఉద్యమం నేపథ్యంలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసినట్లుగా ప్రకటించిన మోడీ ప్రభుత్వం వాటిని దొడ్డిదారిన అమలు చేసే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. సిఐటియు మండల నాయకులు ఎస్ బ్రహ్మాజీ, రైతు నాయకులు మళ్ల సాంబమూర్తి, ఆడారి శ్రీరాముడు, శరగడం మహాలక్ష్మి నాయుడు, దొడ్డి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
కె.కోటపాడు : దేశవ్యాప్త బ్లాక్ డే కార్యక్రమాలు భాగంగా మండలంలోని ఏ కోడూరు గ్రామంలో గురువారం రైతు సంఘం, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసించారు. ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రొంగలి ముత్యాల నాయుడు, ప్రజాసంఘాల కన్వీనర్ ఎర్ర దేవుడు మాట్లాడుతూ రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా దళారులకు దోచుపెట్టి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. రైతు సంఘం నాయకులు వనము సూర్యనారాయణ, వేమల చిట్టిబాబు, రొంగలి గోపి, దేవుడి నాయుడు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా
ప్రజాశక్తి- నక్కపల్లి:కేంద్ర బడ్జెట్‌లో రైతాంగానికి, కూలీలు, కార్మికులకు కేటాయింపులు పెంచాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో గురువారం తహాశీల్ధార్ కార్యాలయం ధర్నా చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ అశోక్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం 2023 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిందని, దానికి అనుగుణంగా బడ్జెట్‌లో ఏ మాత్రం కేటాయింపులు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇస్తున్న ఎరువుల సబ్సిడీలకు కేటాయింపులు తగ్గించారన్నారు.రైతులను వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి ఏ విధమైన కేటాయింపులు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.త్రినాధ్‌రావు, సిపిఎం మండల కార్యదర్శి ఎం.రాజేష్, నాయకులు ప్రసాద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
వినూత్న నిరసన
ప్రజాశక్తి-మాడుగుల: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రైతులకు, కూలీలకు తీవ్ర అన్యాయం జరిగిందని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భవాని తెలిపారు. గురువారం మండలంలోని ఒమ్మలి గ్రామంలో చెరుకు రైతులు, కూలీలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మోడీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఎరువుల పై 50 వేల కోట్లు, ఉపాధి రంగంపై 30 వేల కోట్లు కోత విధించిందన్నారు. ఈ కారణంగా రైతుల ఆత్మ హత్యలు పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికే గత ఏడాది నిర్వహించిన ఉపాధి హామీ పనులకు సంబంధించి రూ.16 వేల కోట్ల నిధులు చెల్లించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.










