Mar 18,2022 15:39

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ షివోమీ బడ్జెట్‌ ధరలో అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. స్నాప్‌ డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌, 50 ఎంపీ మెయిన్‌ కెమెరాను అందుబాటులోకి తెచ్చింది.
రెడ్‌ మీ10 స్మార్ట్‌ ఫోన్‌ 6.71 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 20.6:9 యాస్పెట్‌ రేషియోతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వీడియోస్‌ను హైయ్యస్ట్‌ రెజెల్యూషన్‌తో వీడియోలు చూసేందుకు వైడ్‌వైన్‌ ఎల్‌1 సర్టిఫికెషన్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో డిస్‌ ప్లే డిజైన్‌ చేసింది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 680 చిప్‌, 6జీబీ ర్యామ్‌ 128జీబీ యూఎఫ్‌ఎస్‌ 2.2స్టోరేజ్‌, 50 ఎంపీ మెయిన్‌ కెమెరా, ఫోన్‌ వెనుక భాగంగాలో 2ఎంపీ డెప్త్‌ సెన్సార్‌, 5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉంది.
దీంతో పాటు ఎవరికైనా అర్జెంట్‌ కాల్‌ చేయాల్సి వస్తే ప్యాంటు జేబులో ఉన్న ఫోన్‌ బయటకు తీసి ఫోన్‌ను చూసి అన్‌లాక్‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకమైన రేర్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ఫీచర్‌తో మీరు ఫోన్‌ చూడకుండా జస్ట్‌ మీ చేతి వేళ్లను ఫోన్‌కు టచ్‌ చేస్తే చాలు. ఫోన్‌ అన్‌లాక్‌ అవుతుంది. ఐపీ సర్టిఫికేషన్‌ను అందిస్తుంది.
రెడ్‌ మీ 10 స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ/64జీబీ వేరియంట్‌ ధర రూ.10,999 ఉండగా.. 6జీబీ/128జీబీ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ.12,999 గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌పై ఈఎంఐ ఆప్షన్‌తో పాటు రూ.1000 తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
ఇక ఈ ఫోన్‌ మార్చి 17న మార్కెట్‌లోకి విడుదల చేయగా... మార్చి 24 మధ్యాహ్నం 12గంటల నుంచి ఎంఐ.కామ్‌,ఫ్లిప్‌ కార్ట్‌, ఎంఐ స్టోర్‌తో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయోచ్చు. కాగా, ఈ ఫోన్‌ కరేబియన్‌ గ్రీన్‌, పసిఫిక్‌ బ్లూ, మిడ్‌నైట్‌ బ్లాక్‌ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది.