Feb 06,2022 12:39

అసలే పేదరికం
ఆపై చదువులా
ఎవరు చదువుకోవాలి
ఎందుకు చదువుకోవాలి
కూటి కోసం కోటి విద్యలంటారే
ఆ చదువులెక్కడున్నాయో
కడుపులో పేగులను
ఆకలి మెలిపెడుతుంటే
మధ్యాహ్న భోజన పథకంలో
బడికి పోదామంటే
కరోనా కాటేసినా ఫర్వాలేదు
బడిని కరోనా కౌగిలించుకుని
బందీలో బడి గోడలే కాదు
నాలాంటి వాళ్ల ఆకలి కేకలు
నా చేతిరాతలు
నా కంఠ స్వరాల తేనె పాటలు
స్నేహితులతో ఆడిన ఆటలు
రోజువారి అలవాట్లు
ఎన్నిసార్లు నెమరువేసుకున్నా
విద్య మిద్దెల వారికేనా
దిగువున వారికందేనా
కరోనా బడి మూయించడంలో
స్వలాభం కోసం నీ వాటా ఎంత?

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
94930 33534