కృష్ణకుమార్‌ను సన్మానిస్తున్న అధికారులు, సచివాలయ సిబ్బంది
ప్రజాశక్తి-ఆలూరు
ఆలూరు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న కృష్ణకుమార్ ఇఒఆర్‌డిగా పదోన్నతిపై సత్యసాయి జిల్లా ముదిగుబ్బకు బదిలీపై వెళ్తుండగా సన్మానించారు. శుక్రవారం ఎంపిడిఒ అల్లాబకాష్, ఆలూరు ఇఒఆర్‌డి ప్రకాష్ నాయుడు, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు కలిసి ఘనంగా సన్మానించారు. కార్యదర్శిగా గ్రామాభివృద్ధికి, కిందిస్థాయి ఉద్యోగుల సమన్వయంతో పనులు చేయించి అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. కార్యదర్శి కృష్ణకుమార్ మాట్లాడుతూ... ప్రజాసేవకు, గ్రామాభివృద్ధికి సహకరించిన ఉన్నతాధికారులకు, పంచాయతీ, సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కేటాయించిన విధులను సక్రమంగా చేసి ప్రజలు, అధికారుల మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు.










