Jun 23,2023 23:44

వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి - అరకులోయ రూరల్‌:జిఒ 3కు చట్టబద్దత కల్పించి మైదాన ప్రాంత గిరిజనేతర ఉపాధ్యాయులకు ఏజెన్సీలో బదిలీలు వెంటనే రద్దు చేయాలని ఏపీ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు శుక్రవారం అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణకు క్యాంప్‌ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం నాయకులు మాట్లాడారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో జిఒ 3 పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుడంగా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో మైదాన ప్రాంతానికి చెందిన గిరిజనేతర సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటి) 400 మందిని వివిధ ప్రభుత్వ స్కూల్స్‌లో కొత్తగా బదిలీలు ఎలా చేస్తారని అన్నారు. గిరిజనేతర ఉద్యోగులను గిరిజన ప్రాంతానికి తరలించడం గిరిజన హక్కులకు తీవ్ర భంగం కలిగించే విధంగా ఉందని తక్షణమే బదిలీలు రద్దు చేయాలని చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ 3పై ఎందుకు రివ్యూ పిటిషన్‌ దాఖలు లేదని, గిరిజనులపై ఎందుకు వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు.పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రాంత ఉపాధ్యాయులు గిరిజన ప్రాంతాల్లో బదిలీలు ప్రక్రియ మొదలు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న, మండల అధ్యక్షుడు జి.బుజ్జి బాబు,కె.రామారావు, కె.మగ్గన్న, టి.హరి, సత్యనారయణ, జోషి, తదితరులు పాల్గొన్నారు.
బదిలీలు రద్దు చేయాలి
ఎమ్మెల్యేకు ఆదివాసి గిరిజన సంఘం వినతి