Sep 28,2023 21:14

బది'లీల'లు

కడప ప్రతినిధి : జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో మాడిఫికేషన్‌ బదిలీల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వం గతంలో జారీ చేసిన 143 జిఒ ప్రకారం పిహెచ్‌సి కేంద్రాల్లో ఒకే రకమైన పోస్టులు ఉండకూడదని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గత నెల 24, 25వ తేదీల్లో రీజినల్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన పిహెచ్‌సి కేంద్రాల్లోని అన్ని కేడర్లకూ రీ డిప్లారు మెంట్‌ చేశారు. తాజాగా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అమరావతి యంత్రాంగం డిఎం హెచ్‌ఒ, జిల్లా మలేరియా కార్యాలయాలకు ఇద్దరు చొప్పున ఎంపిహెచ్‌ఇఒలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెఫ్ట్‌ను మానిటరింగ్‌ చేయడానికి ఇద్దరు ఎంప ిహెచ్‌ ఇఒలను, జిల్లా మలేరియా కార్యాలయంలో ఫీల్డ్‌, రిజర్వ్‌ నిమిత్తం ముగ్గురు ఎంపిహెచ్‌ఇఒలను నియ మించింది. వీరిలో ఇద్దరిని మైదుకూరు, పోరు మా మిళ్ల ప్రాంతాల ఫీల్డ్‌ నిమిత్తం, రిజర్వ్డ్‌ నియ మిత్తం ఒకరిని కేటాయించారు. గత నెలలో నిర్వహి ంచిన రీ డిప్లారుమెంట్‌ కౌన్సిలింగ్‌లో జోనల్‌ అధికారి జిల్లా మలేరియా కార్యాలయంలో ముగ్గురు ఉండ గా మరో నలుగురు ఎంపిహెచ్‌ఇలను కేటా యిం చింది. ఈలెక్కన జిల్లా మలేరియా కార్యాల యం లోనే ఏడుగురు ఎంపిహెచ్‌ఇఒలు ఉన్నట్లు లెక్క తేలుతోంది. 143 జిఒ ప్రకారం రీ డిప్లారు మెంట్‌ కౌన్సెలింగ్‌ ముగిసి నెల రోజులు గడిచిన తరువాత మూడు పిహెచ్‌సి కేంద్రాల్లో ఖాళీలను ఉంచి జిల్లా
మలేరియా అధికారి కార్యా లయానికి బదిలీ చేయడంలోని మతలబేమిటో తెలి యడం లేదు. కడప -అనంతపురం జిల్లా సరిహద్దు పిహెచ్‌సి నుంచి ఒకరిని, మిగిలిన ఇద్దరిని అన్నమయ్య, అనం తపురం జిల్లాల పిహెచ్‌సి కేం ద్రాల నుంచి బదిలీ చేయడం గమనార్హం. ఇటు వంటి బదిలీలతో 143 జిఒను అపహాస్యం చేసి నట్లు అవుతోందనే వాదన వినిపిస్తోంది. పిహె చ్‌సిల్లో ఉండాల్సిన ఎంప ిహెచ్‌ఇఇలను నిబం ధనలకు వ్యతిరేకంగా జిల్లా మలేరియా అధికారి కార్యాలయానికి సుమారు నలు గురిని కేటా యించడం గమనార్హం. వీరిలో ఒకరు రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారికి సన్ని హితంగా వ్యవ హారాల్ని చక్కబెడుతున్నారనే ఆరోప ణలు ఎదు ర్కొంటున్న ఎంపిహెచ్‌ఇఇ రీ డిప్లా రుమెంట్‌ కింద అనంతపురం జిల్లాకు వెళ్లాల్సి ఉండగా మళ్లీ జిల్లా మలేరియా కార్యాలయం (డిఎంఒ)లో నియ మితు లు కావడం చర్చనీ యాంశంగా మారింది. దీనిపై ఆర్‌డిని ఫోన్‌లో సంప్రదించగా అందు బాటులోకి రాకపోవడం గమనార్హం.