Jul 24,2023 22:01

ఫొటో : సన్మానం చేస్తున్న ఉపాధ్యాయులు

బదిలీ ఉపాధ్యాయులకు సన్మానం
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన నలుగురు ఉపాధ్యాయులకు సోమవారం పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల కేశవులు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సిబ్బంది బదిలీ ఉపాధ్యాయులు శాలువాలు పూలమాలతో సన్మానించి సత్కరించారు. అనంతరం బదిలీ ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమపై విద్యార్థులు ఉపాధ్యాయులు బోధ నేతర సిబ్బంది చూపిన ఆదరాభిమానాలు మరువలేమన్నారు.