Jan 30,2023 23:24

జగన్నాథంను సత్కరిస్తున్న వైద్య ఉద్యోగులు


ప్రజాశక్తి -పాడేరు: మండలంలోని మినుములూరు పిహెచ్‌సి డోకులూరు సచివాలయంలో ఎనిమిదేళ్లుగా కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించి, అడుగులపుట్టు సచివాలయానికి బదిలీపై వెళ్తున్న కొర్ర జగన్నాథానికి సోమవారం ఘనవీడ్కోలు పలికారు. సోమవారం గొట్టిపల్లి చర్చి వద్ద ఎఎన్‌ఎం పుష్ప, హెల్త్‌ అసిస్టెంట్‌ లక్ష్మణరావు, ఆశ వర్కర్లు, సిహెచ్‌డబ్ల్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో పిహెచ్‌సి వైద్యాధికాఇర డాక్టర్‌ వి.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ, కష్టపడే తత్వం ఉన్న జగన్నాథం, డోకులూరులో ప్రజలకు మంచి సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. సభకు అధ్యక్షత వహించిన వైద్యఆరోగ్య ఉద్యోగుల సంఘం నాయకుడు శెట్టినాగరాజు మాట్లాడుతూ, జగన్నాథం ప్రజలకు ఎంతమంచి సేవలు అందించారో, స్థానికులు ఆయనకు అందించిన ఘనవీడ్కోలే నిదర్శనమన్నారు. ప్రజలు, ఉద్యోగులతో స్నేహభావంతో ఉంటూ, ఉత్తమమైన వైద్యసేవలు అందించిన జగన్నాథం, కొత్త పనిప్రదేశంలోనూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.