ప్రజాశక్తి - చిప్పగిరి
చిప్పగిరి తహశీల్దార్ కార్యాలయంలో రీసర్వే డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న గుండాల నాయక్‌ను కార్యాలయ సిబ్బంది సన్మానించారు. గుండాల నాయక్‌కు ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌గా ఆలూరుకు బదిలీ చేసింది. బదిలీపై వెళ్తున్న ఆయనను గురువారం తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. తహశీల్దార్ మాట్లాడుతూ... కార్యాలయంలో ప్రతి పనిలోనూ తమకు బాగా సహకరించారని గుండాల నాయక్‌ను ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఎక్కడికి వెళ్లినా తన పని తాను చేసుకుంటూ మంచి ప్రతిభ కనబరచాలని తెలిపారు. అలాగే మరిన్ని పదోన్నతులు పొంది ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. సీనియర్ అసిస్టెంట్ మధు స్వామి, విఆర్‌ఒల బృందం, సర్వేయర్లు, గ్రామ సేవకులు పాల్గొన్నారు.
డిప్యూటీ తహశీల్దార్ గుండాల నాయక్‌ను సన్మానిస్తున్న తహశీల్దార్ లక్ష్మీనారాయణ










