Aug 28,2023 23:55

మాట్లాడుతున్న కమిషనర్‌ కీర్తి చేకూరి

గుంటూరు: బడిఈడు పిల్లలందరూ పాఠశాలల్లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి జిఎంసి నోడల్‌ అధికారులను, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్‌ హాల్లో నగరంలో బడి ఈడు పిల్ల లను పాఠశాలల్లో చేర్చే కార్యక్రమంపై సమీక్ష నిర్వ హించారు. కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలోని ప్రతి సచివాలయం పరిధిలో 5 ఏళ్ల నుండి 18 ఏళ్లలోపు పిల్లల్లో బడికి వెళ్లని వారి వివరాలు ఎడ్యుకేషన్‌ సెక్రెటరీల ద్వారా సేకరించాలని, నోడల్‌ అధికారులను ఆదేశించారు. బడికి వెళ్ళని వారిలో ర్యాట్‌ పికర్స్‌ పిల్లలు, వలసలు వచ్చిన వారి పిల్లలపై నోడల్‌ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. రెండ్రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. నగరంలో బడి ఈడు పిల్లలు ఏఒ క్కరూ బడికి వెళ్ళకుండా ఉండకూడదని తెలిపారు .సమావేశంలో అదనపు కమిషనర్‌ పి.రోజా, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్‌.శ్రీనివాస్‌, డి.రవీంధ్ర, ఎస్‌.ఈ. భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


అవుట్‌సోర్సింగ్‌ కార్మికుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా
జిఎంసి, ప్రజారోగ్య మలేరియా విభాగంలో పనిచేస్తూ అనారోగ్యంతో మరిణించిన కార్మికుడు బండి రాజు కుటుంబానికి నగర కమిషనర్‌ కీర్తి చేకూరి ఎక్స్‌గ్రేషియా అందచేశారు. సోమవారం కమిషనర్‌ తన చాంబర్‌లో బయాలజిస్ట్‌ మధుసూదన్‌తో కలిసి రాజు భార్య రమణకు ఎక్స్‌ గ్రేషియా రూ.2 లక్షల చెక్‌ని అందించారు.