Jun 06,2023 00:21

చిరు వ్యాపారులతో కలిసి నిరసన తెలుపుతున్న రమణ

ప్రజాశక్తి -తగరపువలస : స్థానిక కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ ఎదురుగా భీమిలి రోడ్డు పక్కన ఏర్పాటుచేసుకున్న పలు బడ్డీల తొలగింపు యత్నాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ కౌన్సిలర్‌, వైసిపి నాయకులు జివి.రమణ అధికారులను డిమాండ్‌ చేశారు. బడ్డీలు తొలగించాలంటూ జివిఎంసి ఒకటో జోన్‌ అధికారులు సంబంధిత చిరు వ్యాపారులకు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ సోమవారం బడ్డీల వద్దనే బాధిత చిరు వ్యాపారులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంత మంది పేదలు రోడ్డు పక్కన పకొడీ, మాంసం తదితర దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. చిరు వ్యాపారుల పొట్ట కొడితే ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.