
ప్రజాశక్తి - యంత్రాంగం
ఆరిలోవ : బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం అంబేడ్కర్ నగర్, సుందరయ్యనగర్, టిఐసి పాయింట్ ప్రాంతాల్లో ప్రచార భేరీ పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సిపిఎం, సిపిఐ నాయకులు ఆర్‌కెఎస్‌వి.కుమార్, ఎస్‌కె.రెహ్మాన్ మాట్లాడుతూ కేంద్రంలో ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు, వంద రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలు తగ్గింపు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు వి.నరేంద్రకుమార్, ఎస్.రంగమ్మ, అప్పారావు, పి.శ్రీనివాసరావు, దేవుడమ్మ పాల్గొన్నారు.
మధురవాడ : ఈ నెల 26న సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో బహిరంగసభను జయప్రదం చేయాలని ఆయా పార్టీల నేతలు కోరారు. జివిఎసి ఐదోవార్డు పరదేశీపాలెంలో ప్రచారభేరి బహిరంగసభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు నాయకులు డి అప్పలరాజు, వి సత్యనారాయణ, దుంప అప్పలరెడ్డి, బి.భారతి, వి.సన్నిపాత్రుడు,డి కొండమ్మ పాల్గొన్నారు.
తగరపువలస : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించాలని కోరుతూ 26న కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక జంక్షన్‌లో వాల్ పోస్టర్‌ను విడుదల చేసారు ఆయా పార్టీల నాయకులు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, రవ్వ నరసింగరావు, ఎస్ అప్పలనాయుడు, సిపిఐ నాయకులు అల్లు బాబూరావు, కానూరి రాంబాబు, ఎం అప్పలరాజు, ఎన్ ఆదినారాయణ, వై అప్పలనరసయ్య పాల్గొన్నారు.
గాజువాక:ఉక్కు పరిరక్షణకు ప్రజా భాగస్వామ్యం అవసరమని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కెఎం. శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు అన్నారు. పెదగంట్యాడ కూడలిలో ప్రచారభేరిని ప్రారంభించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా ముక్తకంఠంతో నిరసించాలని పిలుపునిచ్చారు. వామపక్ష నేతలు కశిరెడ్డి సత్యనారాయణ, యేలేటి శ్రీనివాస్, జి.ఆనంద్, కోవిరి అప్పలరాజు , అప్పారి విష్ణుమూర్తి, కణితి అప్పలరాజు, పల్లేటి పోలయ్య, పాల వెంకయ్య, వై.నందన్న , అప్పలరెడ్డి, డి.వెంకటరావు పాల్గొన్నారు.
భీమునిపట్నం : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం భీమిలి జోన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం భీమిలిలో ప్రచారభేరి పాదయాత్ర నిర్వహించారు. అప్పికొండ వీధి, గాడువీధి, గొల్ల వీధి, నెహ్రూ వీధి తదితర ప్రాంతాల్లో పాద యాత్ర నిర్వహించి కరపత్రాలను పంచారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు రవ్వ నరసింగరావు, ముఠా కార్మికులు పాల్గొన్నారు
పరవాడ : ఈ నెల 26న కూర్మన్నపాలెంలో జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు వివి.రమణ పిలుపునిచ్చారు. ప్రచార భేరి కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో ఉక్కునగరంలో జరిగింది. రమణ మాట్లాడుతూ దేశ సంపదను అదాని, అంబానీకి మోడీ ప్రభుత్వం దోచిపెడుతుందని విమర్శించారు. బి.శ్రీనివాస్, డి.లక్ష్మి, జి.రాము నాయుడు, జె మణి, రాము, అప్పారావు పాల్గొన్నారు.
సబ్బవరం:బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ప్రభావతి కోరారు. మండలంలోని వంగలిలో ప్రచారం చేశారు.డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు జి.కోటేశ్వరరావు, గండి నాయన బాబు, ఉప్పాడ సత్యవతి, యర్రా సోంబాబు, చిన్నికృష్ణ, కంద అప్పారావు, రామునాయుడు, సోము నాయుడు పాల్గొన్నారు.
కె.కోటపాడు : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందని సిపిఎం మండల నాయకులు ఎర్ర దేవుడు విమర్శించారు. మండలంలోని కింతాడ శివారు బర్తివానిపాలెం గ్రామంలో ప్రచార భేరి నిర్వహించారు. ఆ గ్రామంలో ఉపాధి కూలీలతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు వనము సూర్యనారాయణ. ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : మండలంలోని మోసయ్యపేట గ్రామాల్లో ప్రచార భేరి నిర్వహించారు. సిపిఎం సీనియర్ నాయకులు కరి అప్పారావు, అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్ రాము మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం మోడీ అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి దేవుడు నాయుడు, ఎస్ బ్రహ్మాజీ, వివి శ్రీనివాసరావు, కె సోమనాయుడు, ఆర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కోటవురట్ల: కేంద్ర ప్రభుత్వం దుర్మార్గాలను ప్రతి ఒక్కరు నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఎం, సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. ప్రచారబేరిలో భాగంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ నాయకులు మాట్లాడుతూ, ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను, ఓడరేవులను బిజెపి కార్పొరేట్లకు అక్రమంగా కట్టబెడుతుందని విమర్శించారు.
గొలుగొండ:సిపిఎం, సిపిఐల ప్రచార భేరి నియోజకవర్గం సభ ఈ నెల 28న సాయంత్రం 4గంటలకు నర్సీపట్నంలో జరుగుతుందని ఈ సభను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు కోరారు. ఈ సభకు సిపిఐ, సిపిఎం రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరవుతారన్నారు. గొలుగొండ, పాతమల్లంపేట, ఎన్.గదబపాలెంలో సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేశారు.ఈ సందర్భంగా అడిగర్ల రాజు మాట్లాడుతూ, సాగులో ఉన్న గిరిజన రైతలకు ఆర్‌ఒఎప్‌ఆర్ పట్టాలు, రైతు బరోసా అందడం లేదన్నారు. జీడిమామిడి పంటకు మార్కెట్‌లో ధర ఉన్నప్పటికి రైతులకు ఆ ధరను ఇవ్వడం లేదన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు సాపిరెడ్డి నారాయణముర్తి మాట్లాడుతూ, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి ఎన్.లక్ష్మణరావు, జి.శివ, సత్తిబాబు, రామకృష్ణ, తలుపులు, రాము పాల్గొన్నారు.