Jul 31,2021 21:47

కోల్‌కతా : కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. తన ఎంపి పదవికి రాజీనామా చేస్తానని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఢిల్లీలో కేంద్రం తనకు కేటాయించిన నివాసాన్ని నెలరోజుల్లో ఖాళీ చేస్తానని పేర్కొన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, రాజకీయాల్లో ఉండి సామాజిక సేవచేయడం సాధ్యంకాదనే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని పేర్కొన్నారు. ప్రముఖ గాయకుడైన సుప్రియో 2014 ఎన్నికల ముందు బిజెపిలో చేరారు. రెండుసార్లు ఎంపిగా గెలిచి, మంత్రి పదవి పొందారు. ఇటీవల బెంగాల్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో, అధిష్టానం ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించింది.